హంగ్ ఏర్పడితే.. రాజ్యాంగానికి కట్టుబడి ఉండండి

హంగ్ ఏర్పడితే.. రాజ్యాంగానికి కట్టుబడి ఉండండి
  • రాష్ట్రపతికి ఏడుగురు మాజీ జడ్జీల లెటర్

న్యూఢిల్లీ: పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో  హంగ్ ఏర్పడితే రాజ్యాంగానికి కట్టుబడి నిర్ణయం తీసుకునేందుకు రెడీగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీజేఐ డీవై చంద్రచూడ్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌‌‌‌ను మాజీ న్యాయమూర్తులు కోరారు. ఈమేరకు సోమవారం వారికి మద్రాస్ హైకోర్టుకు చెందిన మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జీఎం.

జస్టిస్ అక్బర్ అలీ, అరుణ జగదీశన్, డి.హరిపరంధామన్, పీఆర్ శివకుమార్, సీటీ. సెల్వం, ఎస్.విమల, పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అంజనా ప్రకాశ్ లెటర్ రాశారు. బీజేపీ ఎన్నికల్లో ఓడిపోతే..అధికార మార్పిడి సజావుగా ఉండకపోవచ్చని తమ లేఖ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు." బీజేపీ ఓటమి రాజ్యాంగ సంక్షో భాన్ని సృష్టించవచ్చు.

హంగ్ ఏర్పడిన వెంటనే కొనుగోళ్లు, బెదిరింపులతో కొందరు ఎంపీలు పార్టీలు మారవచ్చు. గతంలో కంటే ఈసారి జరిగిన ఎన్నికల్లో మైనారిటీలపై విద్వేషపూరిత ప్రసంగాలు ఎక్కువగా జరిగాయి. ప్రచారంపై, ఎన్నికల నిర్వహణపై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఎన్నిసార్లు పట్టుబట్టినా ఈసీ తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేదు. దాంతో  ప్రజల్లో అసంతృప్తి నెలకొంది.

అందువల్ల ఓట్ల లెక్కింపు సందర్భంగా మంగళవారం  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా జోక్యం చేసుకోవడానికి రెడీగా ఉండండి. రాజ్యాంగానికి కట్టుబడి తగిన నిర్ణయం తీసుకోండి” అని మాజీ జడ్జీలు తమ లేఖలో పేర్కొన్నారు.